Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీభవన్‌లో వాస్తు దోషం వుందా? రేవంత్ రెడ్డి మార్పులు చేస్తున్నారుగా!

Webdunia
శనివారం, 3 జులై 2021 (21:03 IST)
గాంధీభవన్‌లో వాస్తు దోషం వుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షుడు గాంధీభవన్‌లో చేస్తున్న మార్పులేంటి..? తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టుకోల్పోతోంది. గెలిచిన ఒక్కో ఎమ్మెల్యే జారిపోతుండడంతో.. పీసీసీ పెద్దలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో పడిపోయారు. 
 
దాదాపు ఆరేళ్ల తర్వాత పీసీసీ పగ్గాలు చేతులు మారాయి. తెలంగాణ పీసీసీ బాధ్యతలను రేవంత్‌ రెడ్డి అందిపుచ్చుకున్న తర్వాత గాంధీభవన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పనిలో పనిగా.. గాంధీభవన్‌ వాస్తులోనూ మార్పులు చేస్తున్నారు. వాస్తు నిపుణుల సూచనల ఆధారంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత పాలకుల సంప్రదాయాలను బద్దలు కొడుతున్నారు.
 
ప్రస్తుతం గాంధీభవన్‌ ఎంట్రన్స్‌ దక్షిణం వైపు ఉంది.. ఇక మీదట తూర్పుద్వారం నుంచి ఎంటర్‌ అవుతారు. దక్షిణ ద్వారం నుంచి ఎగ్జిట్‌ అయ్యేలా మార్పులు చేశారు. అంతేకాదు.. గాంధీభవన్‌ ముందు ఎక్కువ స్పేస్‌ ఉండేలా చూస్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్ల చాంబర్‌లు కూడా మారబోతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి చాంబర్‌ తూర్పువైపు తీసుకురాబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments