Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

తెలంగాణా, ఆంధ్ర‌ల మ‌ధ్య వివాదానికి కొంద‌రి కుట్ర‌

Advertiesment
conspiracy
, శుక్రవారం, 2 జులై 2021 (18:43 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణాల మ‌ద్య వివాదాలు సృస్టించ‌డానికి కొన్ని శ‌క్తులు ప‌నిచేస్తున్నాయ‌ని రాష్ట్ర ప్రజా వ్యవహారాల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణా, ఆంధ్ర‌ల మ‌ధ్య వివాదానికి కుట్ర చేస్తున్నార‌ని అనిపిస్తోంద‌ని ఆయ‌న బ‌దులిచ్చారు.

వివాదాలు సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అనుమానంగా ఉంది... ఆవసరమైతే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత... కేంద్రమే తీసుకోవాలని కోరతాం. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందని అనుకోవడం లేద‌ని స‌జ్జ‌ల మీడియాకు తెలిపారు. ఏపీకి హక్కుగా వచ్చిన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.
 
మన రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. జల  వివాదం పరిష్కారం కావాలి... సానుకూల నిర్ణయం రావాలనే  సీఎం జగన్ ప్రధానమంత్రి, కేంద్ర జల శక్తి మంత్రికి  లేఖలు రాశారు. పరిష్కారం కానిదంటూ ఏదీ లేద‌ని స‌జ్జ‌ల వివ‌రించారు.
 
881 అడుగులు ఎత్తు ఉంటే తప్ప, పోతిరెడ్డి పాడు నుంచి 40 వేల క్యూసెక్కులు తీసుకునే పరిస్ధితి లేద‌ని, ప్రస్తుతం తక్కువ సమయం వరద వస్తోంద‌ని,15 రోజులు కూడా రిజర్వాయర్లలో  పూర్తి స్థాయి నీటి మట్టం ఉండటం లేద‌న్నారు. తక్కువ  సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవడాన్ని గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించార‌ని తెలిపారు.

రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా నేనే ముందుండి అన్యాయం జరగకుండా చేస్తానని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహించారని, ఇపుడు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియ‌డం లేద‌న్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవడమే రాయలసీమ  ప్రాజెక్టు నిర్మాణం లక్ష్యమ‌ని, సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు చేస్తోన్న ప్రయత్నాన్ని, గతంలో కేసీఆర్ అంగీకరించి, ప్రోత్సహించారని తెలిపారు.

ఉభయ రాష్ట్రాల మధ్య సీఎం ల‌ మధ్య గతంలో జరిగిన సమావేశంలో... నేనూ ఉన్నా...ఇద్దరు ముఖ్యమంత్రులు గతంలో అంగీకరించారు.... ఒపెన్ మైండ్ తో గతంలో కేసీఆర్ మాట్లాడారు. పరిపాలన కోసం తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి కానీ  రెండు తెలుగు రాష్ట్రాలు ఒకటేనన్నారు. రాయలసీమ కష్టాలు నాకు తెలుసని కేసీఆర్ అన్నారు. పరస్పరం ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలని కేసీఆర్ అన్నారు....ఈరోజున  ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో  తెలియద‌ని స‌జ్జ‌ల చెప్పుకొచ్చారు.

800 అడుగుల లోపే విద్యుత్ ఉత్పత్తి ని ప్రారoభించారు... అడిగితే మాటల దాడి మొదలు  పెట్టారు. ఏడాదికి 600 టీఎంసీలు కూడా రావడం లేదు. పరుషంగా అనవసరంగా మాట్లాడటం సరికాదనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యం. రాజకీయంగా మంత్రులు మాట్లాడతారు. లేకపోతే కేంద్రమే న్యాయం చేయాలని అడుగుతాం. రెండు రాష్ట్రాల మధ్య కంట్రోల్ తప్పే పరిస్ధితి ఉండదని భావిస్తున్నాను. అయితే, మ‌న రాష్ట్రంలో ప్ర‌తిపక్షం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంద‌ని, సంయమనం పాటించాల‌ని, కాదని వ్యవహరిస్తే నష్టపోయేది రాష్ట్రమే అనే విషయం గుర్తించాల‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోక్య బ్రాండ్‌ కింద పన్నీర్‌ను విడుదల చేసిన హట్సన్‌ ఆగ్రో ప్రోడక్ట్‌ లిమిటెడ్‌