హైదరాబాదు నగరంలో స్మార్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. వివాదాల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పేమెంట్ యాఫ్స్ కార్డులు ఇతరత్రా నగదు రహిత లావాదేవీలను నిర్వహించడం వంటివి ఇది చేస్తుంది.
ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ ఈ సంస్థను 2008లో ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ. 500 కోట్ల పెట్టుబడితో ఎన్‌పీసీఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్‌కు రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. ఎన్‌పీసీఐ ఈ డేటా సెంటర్‌ను అంతర్జాతీయస్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తోంది.
ఈ డేటా సెంటర్‌ను నిర్మించేందుకు ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు. భూకంపం, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలకు చెక్కుచెదరకుండా ఉండేటట్లు అత్యంత పటిష్టంగా నిర్మించనున్నారు. ఇది పూర్తయితే దేశంలో అతి పెద్ద డిజిటల్ ఆన్ లైన్ నిర్వహణ కేంద్రంగా హైదరాబాదు మారనున్నది.