Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పంచ్‌గా పోటీ చేయాలని భార్యపై ఒత్తిడి.. పురుగుల మందు తాగి...

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (16:45 IST)
గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలని భార్యపై భర్త చేసిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని దిండి మండలంలోని ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగయ్యకు 8 నెలల క్రితం రాధ (22) అనే యువతితో వివాహం జరిగింది.
 
వివాహం సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, అత్తమామలు బైకును తీసివ్వాల్సివుంది. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ బైకును కొనివ్వలేక పోయారు. ఈ క్రమంలో ఎర్రగుంటపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీలకు కేటాయించారు. దీంతో తన భార్యను పోటీ చేయించాలని లింగయ్య భావించారు. 
 
ఇందుకోసం రూ.5 లక్షల డబ్బును పుట్టింటికెళ్లి తీసుకుని రావాలంటూ భార్య రాధను వేధించాడు. భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లి తన తల్లిదండ్రులకు తన గోడును వెళ్లబోసుకుంది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రాధ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments