మునుగోడు ఉప ఎన్నికలు : ఏడో రౌండ్‌‌లో తెరాస ఆధిక్యం

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (14:17 IST)
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అధికార తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాక్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడో రౌండ్ ముగిసే సమయానికి ఆయన 2665 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. 
 
తొలి నాలుగు రౌండ్లలో ఆధిక్యం సాధించిన ఆయన.. ఏడో రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ కంటే మెజార్టీలో కొనసాగుతున్నారు. ఈ రౌండ్‌లో తెరాసకు 7189 ఓట్లు లభించగా, బీజేపీకి 6803 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఏడో రౌండ్ ముగిసే సరికి ప్రభాకర్ రెడ్డి 2665 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
కాగా, ఈ ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తెరాసకు తొలి రౌండ్‌లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2, 3వ రౌండ్లలో బీజేపీ ముందుకొచ్చింది. కానీ, వరుసగా 4,5,6,7 రౌండ్లలో తెరాసకు ఆధిక్యం లభించింది. ఏడో రౌండ్ పూర్తయ్యేసరిక్ తెరాసకు 45817 ఓట్లు రాగా, బీజేపీకి 43152 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కేవలం 13676 ఓట్లలో మూడో స్థానంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shobhita Dhulipala: చీకటిలో ... చీకటి రహస్యాలను వెలికితీసే శోభిత ధూళిపాల

Naveen Polishetty: పండగకు .వినోదాన్ని పంచే అల్లుడు వస్తున్నాడు : నవీన్ పోలిశెట్టి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్- ఆన్‌లైన్‌లో కరాటే టు సామురాయ్ కొత్త వీడియో

విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్ వాయిదా

Maruthi: రాజా సాబ్ కు మొదటి రోజు వంద కోట్లకు పైగా వస్తాయని ఆశిస్తున్నాం - టీజీ విశ్వప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

తర్వాతి కథనం
Show comments