Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త అంటోన్న ఎంపీ కవిత.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:38 IST)
'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగు డుగు డుగు డుగు డుగు డుగని..'' ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బుల్లెట్ పాట మోత మోగిస్తోంది. అంతేకాదు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, జోష్, మోజ్, టకాటక్, ఎంఎక్స్ వంటి షార్ట్ వీడియో అప్లికేషన్స్‌లోనూ దుమ్ము రేపుతోంది. లక్షలాది మంది ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇక యూబ్యూట్‌లోనూ బుల్లెట్ పాట రికార్డులు సృష్టిస్తోంది. 
 
కోట్లాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవల ఓ పెళ్లి కూతురు, ఆస్పత్రిలో నర్సు.. బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత కూడా ఈ జానపదానికి అదిరిపోయే స్టెప్పులేశారు.
 
ఎంపీ మాలోత్ కవిత మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత.. బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేశారు. వధూవరులతో పాటు ఎంపీ కవిత కూడా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
కొన్ని రోజులు క్రితం మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓ నర్సు కూడా ఇదే పాటకు స్టెప్పులేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీహెచ్‌సీలో పనిచేస్తున్న నర్సు బుల్లెట్ పాటకు డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. పెళ్లి కూతురు వీడియోలా ఇది కూడా వైరల్‌ అయింది. ఐతే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments