Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట నిలబెట్టుకోలేకపోయాను.. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్తున్నా...

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మాట నిలబెట్టుకోలేక పోయానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణలో బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎంసెట్‌ పరీక్షలను నల్గొండ జిల్లా కనగల్‌ మండలంలోని శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన స్నేహా (16) అనే విద్యార్థిని కూడా రాసింది. అయితే, ఈ ఫలితాల్లో ఆమె అర్హత సాధించలేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
'అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీకు నా మొహం చూపించలేను. మీరు నామీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను నిలబెట్టుకోలేకపోయాను. అందుకే మిమ్మల్ని వదలి వెళ్తున్నా' అంటూ సూసైడ్ నోట్ రాసింది. కూతురు ఆత్మహత్యతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments