నేను, కేసీఆర్ మంచి స్నేహితులం... తెరాసతో పొత్తు వుండొచ్చు... మోత్కుపల్లి

తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నారన్న అంశంపై టి.తేదేపా నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం ఎందుకయినట్లు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించినా రేవంత్ రెడ్డి నుంచి సమాధానం రాబట్టలేకపోయారు. తన

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (20:54 IST)
తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నారన్న అంశంపై టి.తేదేపా నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం ఎందుకయినట్లు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించినా రేవంత్ రెడ్డి నుంచి సమాధానం రాబట్టలేకపోయారు. తన సమాధానం చంద్రబాబు నాయుడు వద్ద చెపుతానంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా తెదేపా సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
 
తెదేపా కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందనీ, అందువల్ల తెలంగాణలో భాజపా అనుకూల పార్టీ అయిన తెరాసతో తాము పొత్తు పెట్టుకునే అవకాశం వున్నదని అన్నారు. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మంచి మిత్రుడనీ, కనుక ఆ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం లేకపోలేదని అన్నారు. ఐతే తను చివరి వరకూ తెలుగుదేశం పార్టీలోనే వుంటానని వెల్లడించారు. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని అధిష్టానమే చూసుకుంటుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments