Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి వచ్చేస్తారా? తలసాని ఎద్దేవా

కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి రారని చురకలంటించారు. సిద్ధిపేటలో శ్రీనివాస్ యాదవ్ విలేకర్ల

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (14:15 IST)
కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి రారని చురకలంటించారు. సిద్ధిపేటలో శ్రీనివాస్ యాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ.. మంత్రి మరోసారి కాంగ్రెస్ నేతలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.


కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనతో తామేదో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని తలసాని ఎద్దేవా చేశారు. కానీ వారు అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోనుందని తలసాని జోస్యం చెప్పారు.
 
అలాగే ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐదు స్థానాల్లో ఉన్న బీజేపీకి 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కదన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తలసాని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు రాబోయే ఎన్నికల్లో తిరిగి టిఆర్ఎస్‌కు పట్టం కట్టడం ఖాయమన్నారు.
 
అంతకుముందు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. గత కొద్దికాలంగా తెలంగాణలో పలువురు ప్రముఖులు హరిత సవాల్‌ను చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మంత్రి తలసానికి హరిత సవాల్ విసిరారు.
 
ఈ సవాలును స్వీకరించిన మంత్రి శుక్రవారం ఉదయం తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఏపీ నేత, టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌లకు హరిత సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments