Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రి సబితమ్మకు ఛాతీ నొప్పి?

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (12:24 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం రాత్రి అస్వస్థతకు లోనయ్యారు. ఆమెకు చాతినొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె బంజారా హిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఆమె ఆరోగ్యంపై వైద్యులు స్పందిస్తూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పలువురు నేతలు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. 
 
ఆమె అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో ఆమె మద్దతుదారులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆమె చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి తరలివెళ్లే ప్రయత్నాలు చేశారు. అభిమానుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో విద్యా శాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపింది. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రికి వెళ్లారని చెప్పింది. వైద్య పరీక్షలు నిర్వహించగా ఫలితాలన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయనీ, అందువల్ల ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments