Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర: సబితా

గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర: సబితా
, ఆదివారం, 8 డిశెంబరు 2019 (16:15 IST)
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర పోషిస్తున్నారు అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్పంచులు బాధ్యతగా వ్యవహరించి గ్రామాల అభివృద్ధి కి తోడ్పడాలని ఆమె సూచించారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ హైస్కూల్ గ్రౌండులో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో సబితారెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి చేతుల మీదుగా 103 గ్రామ పంచాయతీల కు చెత్త సేకరణ నిమిత్తం ట్రాక్టర్లు పంపిణీ చేశారు. 
 
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక తో గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం వచ్చిందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. త్వరలోనే జిల్లాలోని మిగతా అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, కాలె యాదయ్యలు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26న కడపలో సీఎం జగన్ పర్యటన