Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్​ టెలీకాన్ఫరెన్స్

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (07:37 IST)
పురపాలిక ఎన్నికల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్​ టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. తెలంగాణ భవన్​ నుంచి ఎన్నికల వ్యూహాలు, ప్రచార సరళిపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు.

మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో కారు దూసుకెళ్తోంది. అభ్యర్థులు, స్థానిక ఎమ్మెల్యేలు జోరు పెంచారు. పురపాలిక ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్​ టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. ప్రచార సరళి, ఇతర పార్టీల ఎత్తుగడలు, అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై అభ్యర్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.

తొమ్మిది సభ్యుల సమన్వయ కమిటీ జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై ఇచ్చిన నివేదిక ఆధారంగా కేటీఆర్​ అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు.
 
సిరిసిల్లకు రైలు మార్గం
సిరిసిల్ల మునిసిపాలిటీకి సంబంధించి మేనిఫెస్టోను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యుత్తమ మునిసిపాలిటీగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తానన్నారు. సిరిసిల్లలో 50ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో చేశానని స్పష్టం చేశారు.

సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని చెప్పారు. రెండు, మూడేళ్లలో సిరిసిల్లకు రైలు మార్గం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్లను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments