టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు తమ పార్టీ సింబల్‌పై ప్ర్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో రెండు ఎకరాల స్థలంలో కారు ముగ్గు వేశారు. సంక్రాంతి సందర్భంగా వేసిన ఈ ముగ్గు విశేషంగా ఆకర్షిస్తోంది.
అయితే ఈ కారు ముగ్గు కనిపించాలంటే ఐదంస్తుల భవనం ఎక్కాల్సిందే. ఈ కారు ముగ్గు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సిరిసిల్లకు రైలు మార్గం తీసుకొచ్చేందుకు కృషి చేస్తా: మంత్రి కేటీఆర్
సిరిసిల్ల మునిసిపాలిటీకి సంబంధించి మేనిఫెస్టోను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యుత్తమ మునిసిపాలిటీగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తానన్నారు. సిరిసిల్లలో 50ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో చేశానని స్పష్టం చేశారు.
సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని చెప్పారు. రెండు, మూడేళ్లలో సిరిసిల్లకు రైలు మార్గం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్లను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కేటీఆర్ వ్యాఖ్యానించారు.