రాజ్​భవన్​లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం: తమిళిసై

బుధవారం, 15 జనవరి 2020 (19:49 IST)
ప్రజలకు మరింత అందుబాటులో ఉండటానికి రాజ్ భవన్​లో నెలలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

వైద్యురాలిగా, రాజకీయ నేతగా తమిళనాడులో ప్రజలకు సేవ చేశానని... రాజ్ భవన్​ను ప్రజాభవన్​గా భావించి ప్రజలు తమ సమస్యలు తనకు చెప్పుకోవచ్చని తమిళిసై సూచించారు.

తమిళనాడు, తెలంగాణలో చారిత్రక ప్రాంతాలెన్నో ఉన్నాయని... ఇరు రాష్ట్రాల మధ్య పర్యాటకంగా పర్యటించేందుకు తగిన ఏర్పాటు చేయాలని తమిళిసై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.
 
సంక్రాంతి వేడుకల్లో గవర్నర్
రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసై కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. రాజ్​భవన్​లో సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై కుటుంబ సభ్యలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. స్వయంగా నైవేద్యాన్ని తయారు చేశారు.

హారతి ఇచ్చి పూజా కార్యక్రమాన్ని ముగించారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంశ్రలను తెలియజేశారు. రాజ్‌భవన్‌ స్నేహపూర్వక సంబంధాలకు నిలయమని, రాష్ట్రంలో రాజ్​భవన్ అనేది ప్రజాభవన్‌గా వెలుగొందుతుందని గవర్నర్‌ అన్నారు. విజ్ఞప్తులు, స్నేహపూర్వక కలయికలకు రాజ్‌భవన్‌ కేంద్రమని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మంత్రి వనిత కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి