Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలి: గవర్నర్​ తమిళిసై

స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలి: గవర్నర్​ తమిళిసై
, మంగళవారం, 5 నవంబరు 2019 (18:19 IST)
హైదరాబాద్​ కోఠి మహిళా కళాశాల 15వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ పాల్గొన్నారు. స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని... అందుకు పురుషులు స్త్రీలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

హైదరాబాద్ కోఠి మహిళా కళాశాల 15వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్​ పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అమ్మాయిలు ఏది అనుకుంటే అది సాధిస్తారని... తాను కూడా విద్యార్థినిగా ఉన్నపుడు అన్ని రకాల కార్యక్రమాలలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు.

ప్రతి మనిషికి విద్య నూతన జ్ఞానాన్ని, సాధికారతను ఇస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థినులకు తమిళిసై పట్టాలను అందజేశారు. ఎన్​సీసీ విద్యార్థులు నిర్వహించిన గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అరవింద్ కుమార్​, తదితరులు పాల్గొన్నారు.
 
గవర్నర్​ను కలిసి కాంగ్రెస్ నేతలు
రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, జీవన్​రెడ్డి, శ్రీధర్​బాబు కలిశారు. మిడ్​మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ లోపాలపై విచారణ జరిపించాలని గవర్నర్​ను కోరారు. మిడ్​ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ లోపాలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరారజన్​ను కోరారు.

రాజ్‌భవన్‌లో గవర్నర్​ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, శాసనసభ్యులు శ్రీధర్‌బాబు కలిశారు. ప్రభుత్వం మిడ్​మానేరు పునరావాస హామీలు అమలు చేయటం లేదని ఫిర్యాదు చేశారు.

నిర్మాణంలో జరిగిన లోపాలను గుర్తించేలా చర్యలు చేపట్టాలని వారు కోరగా తమిళిసై సానుకూలంగా స్పందించారన్నారు. వేములవాడ రాజన్న, మిడ్​ మానేరును గవర్నర్​ సందర్శించనున్నారని శ్రీధర్​బాబు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేడం...మేడం, నేను..నేను, దారుణం..హృదయవిదారకం..