Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (09:42 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోమారు దన దయాగుణాన్ని చాటుకున్నారు. వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి ఆర్థిక సాయం అందించారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటిలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు.

గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని ఐఐటీలో ర్యాంకు సాధించిన అంజలి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తనకు సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

అప్పుడు వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ గత సంవత్సరం సైతం ఫీజుల నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించారు.

అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్ కావడంతో పూర్తి ఐఐటి విద్య కోసం అవసరమైన నిధులను వ్యక్తిగతంగా  అందజేస్తానని మంత్రి గత ఏడాది హామీ ఇచ్చారు.

ఆ మేరకు అంజలి రెండవ సంవత్సరానికి సంబంధించిన ఖర్చులను  ఈ రోజు ప్రగతిభవన్లో అంజలికి అందజేశారు. మంత్రి కేటీఆర్ అందించిన చేయూత పట్ల ఆయనకు ధన్యవాదాలు తెలిపింది అంజలి కుటుంబం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments