Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యవిద్యార్థిని ప్రాణాన్ని బలితీసుకున్న గుండెపోటు, కెనడాలో కన్నుమూత

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (08:19 IST)
గుండెపోటు. ఈ సమస్యతో రోజూ ఎక్కడో ఒకచోట చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన 24 ఏళ్ల వైద్య విద్యార్థిని గుండెపోటుతో చనిపోయారు. వివరాలు ఇలా వున్నాయి. నిజమాబాద్ మల్కాపూర్‌లో గ్రామ ఉపసర్పంచి వెంకటరెడ్డి పెద్దకుమారుడు అరుణ్ రెడ్డి కెనడాలో స్థిరపడ్డారు. బీడీఎస్ పూర్తి చేసిన అరుణ్ రెడ్డి సోదరి పూజిత రెడ్డి ఈ ఏడాది జనవరిలో కెనడా వెళ్లారు. అక్కడే వారం రోజుల పాటు వున్న తర్వాత యూనివర్శిటీ హాస్టలులో చేరారు.
 
పదిరోజుల క్రితం హఠాత్తుగా ఆమెకి గుండెపోటు వచ్చి హాస్టలు గదిలో కుప్పకూలారు. దీనితో హుటాహుటిన ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలో కోల్పోయారు. ఆమె మృతదేహాన్ని సోదరుడు స్వగ్రామానికి తీసుకుని వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత చదువులకోసం వెళ్లి నిర్జీవంగా మారిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments