Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరం - దగ్గుకు మాత్రలు కావాలంటే ఇకపై వివరాలు ఇవ్వాల్సిందే.. ఎక్కడ?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (17:58 IST)
కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ వైరస్‌కు అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థతుల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇకపై తెలంగాణలో ఫీవర్ సర్వైలెన్స్‌లోనికి మెడికల్ షాపులు రానున్నాయి. మెడికల్ షాపులు ఫీవర్ సర్వైలైన్స్‌లోకి భాగస్వామ్యం చేస్తూ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటివాటికి మాత్రలు కొనుగోలు చేస్తే వారి వివరాలను సేకరించాలని మెడికల్‌ షాపులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 
 
అయితే, ఈ వివరాలను సేకరించిన తర్వాత సర్కారు ఏం చేస్తుందన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ వివరాలు ద్వారా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడేవారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు చేసేందుకే ఈ తరహా నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే.. మెడికల్ షాపుల్లో టాబ్లెట్స్ కొనేవారికి ఇది ఒకింత షాకింగ్ విషయమేనని చెప్పుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments