Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (20:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 14230 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇందులో 192 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ కేసుల్లో ఒక్క హైదరాబాద్ నగరంలోనే కొత్తగా 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 601 మంది ఫలితాలు వెల్లడికావాల్సివుంది. 
 
ఈ కొత్త కేసుల్లో హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 80, రంగారెడ్డిలో 16, మేడ్చల్‌లో 16 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో కరోనా నుంచి 345 మంది కోలుకున్నారు. అయితే, గత 24 గంటల్లో కొత్తగా కరోనా వైరస్ బాధితుల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. 
 
కాగా, తెలంగాణాలో ఇప్పటివరకు 8,34,143 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 8,28,108 మందికి ఆరోగ్యవంతులయ్యాయి. ఇంకా 1924 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనా 4,111 మంది మృతి చెందారు. 
 
దేశంలో 8 వేల దిగువకు కొత్త కేసులు 
దేశంలో కొత్తకా మరో 8 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేరళ వెల్లడించిన 15 మరణాలతో సహా గడిచిన 24 గంటల్లో 45 మరణాలు రికార్డయ్యాయి. 
 
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1.65 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 7,591 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు ఆ సంఖ్య 9 వేలకుపైనే ఉంది. తాజాగా పరీక్షల సంఖ్య తగ్గడంతో కేసుల్లో కూడా తగ్గుదల కనిపించింది. 
 
పాజిటివిటీ రేటు మాత్రం 4.58 శాతానికి చేరింది. వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 84,931(0.19 శాతం)కి తగ్గిందని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
2020 ప్రారంభం నుంచి 4.44 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.38 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న 9,206 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి చేరడం సానుకూలాంశం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments