మెదక్ జిల్లాల్లో విషాదం : సీఎంకు లేఖ రాసి రైతు ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (14:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాల్లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకునేముందు ముఖ్యమంత్రికి లేఖ రాసిమరీ చనిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లాలోని హవేలి ఘన‌పూర్ మండలంలోని బొగడ భూపతిపూర్ గ్రామంలో ఓ యువరైతు ఉన్నాడు. ఈయన కుమారుడు అనారోగ్యంబారినపడ్డాడు. అతనికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేవు. 
 
పైగా, ఆసరా పెన్షన్‌కు అర్హుడైన తన తండ్రికి పెన్షన్ రావడం లేదు. దీనికితోడు పండించిన వరి ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకునిపోయాడు. 
 
ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఆత్మహత్యే శరణ్యమని భావించిన ఆ రైతు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి తన జేబులో పెట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments