Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యాపారంలో నష్టం : ఉరేసుకున్న భర్త - చెరువులో దూకిన భార్య

Advertiesment
వ్యాపారంలో నష్టం : ఉరేసుకున్న భర్త - చెరువులో దూకిన భార్య
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో ఆ దంపతుల మధ్య కలహాలు చెలరేగాయి. దీంతో భర్త ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుుకంది. దీంతో ఆ ఇంట విషాదం చోటు చేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మునిపల్లి మండలం, గార్లపల్లికి చెందిన చంద్రకాంత్, లావణ్య దంపతులు బీహెచ్ఈఎల్‌లో స్థిరపడ్డారు. వీరికి ప్రథమ్ (8), సర్వజ్ఞ (3) ఇనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, చంద్రకాంత్ గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 
 
ఈ వ్యాపారంలో ఆశించినంత పురోగతి లేకపోగా, నష్టాలు వచ్చాయి. ఈ నష్టాల నుంచి ఆయన కోలుకోలేక పోయాడు. ఫలితంగా ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో లావణ్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా కలత చెందిన చంద్రకాంత్ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన భార్య లావణ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆందోళ్ పెద్ద చెరువులో దూకి ఆత్మత్య చేసుకుంది. ఈ మృతదేహాలను శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వచ్చిన మృతదేహాలను స్వాధీనం చేసుకన్నారు. మరో మృతదేహాం కోసం గజ ఈతగాళ్ళతో గాలిస్తున్నారు. కేసు నమోదు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒమిక్రాన్​కు చెక్ పెట్టే కోవాగ్జిన్.. భారత్ బయోటిక్ గుడ్ న్యూస్