Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్ మనస్తాపంతో ఆత్మహత్య

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (11:59 IST)
భార్య వివాహేతర సంబంధాల కారణంగా ఆర్మీ జవాన్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భగత్ నగర్‌కు చెందిన మార్త అశోక్ - పుష్ప దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ (32)కు హాజీపూర్ మండలం ర్యాలీగడ్ పూర్‌కు చెందిన బొద్దు రజితతో 2021 జూన్ 24న వివాహమైంది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్ ఉద్యోగ రీత్యా ఇటీవల అమృతసర్ వెళ్లాడు.
 
ఈక్రమంలో ర్యాలిగడ్‌పూర్‌కు చెందిన బొప్ప రాకేష్‌తో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. రజితను హెచ్చరించినా ఎలాంటి మార్పు లేదు. దీనికి తోడు ప్రియుడితో కలిసి వేధింపులకు రజిత గురిచేసింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన శ్రావణ్‌కుమార్‌.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. అతని మృతికి భార్య రజిత, భాగ్య, రాకేష్‌ కారణమని మృతుని తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments