Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్తతో అక్రమ సంబంధం.. చివరకు శవమై తేలాడు.. ఎలా?

Advertiesment
murder
, బుధవారం, 14 డిశెంబరు 2022 (08:57 IST)
వరుసకు అత్త అయిన మహిళతో ఓ యువకుడు పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరకు అతని ప్రాణాలు తీసింది. ఈ దారుణం ఏపీలోని కడప జిల్లా రాజుపాళెం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మండల కేంద్రమైన రాజుపాళెంకు చెందిన నరసమ్మ అనే మహిళకు కొన్నేళ్ళ క్రితమే భర్త చనిపోయాడు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటు ఉంటుంది. ఈ క్రమంలో తన కుమార్తెను అదే ఊరిలో ఓ పెద్ద దస్తగిరి అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. ఈయనకు తల్లి, తమ్ముడు చిన్న దస్తగిరి (28) ఉన్నాడు. వీరి తండ్రి కూడా కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. 
 
ఈ క్రమంలో నరసమ్మకు చిన్నదస్తగిరికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గత కొంతకాలంగా సాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కుట్టుమిషన్లు రిపేరు చేసే దస్తగిరికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూడసాగారు. ఈ విషయం నరసమ్మకు తెలిసింది. నేను ఉండగా మరో పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానంటూ బెదిరించసాగింది. 
 
శుక్రవారం సాయంత్రం ఇదే విషయంపై అతడితో గొడవకు దిగింది. పైగా, చిన్నదస్తగిరి తనను వదిలి మరో పెళ్లికి సిద్ధమవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆవేశంతో అతన్ని కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నరసమ్మను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలంటూ భార్యపై టెక్కీ భర్త ఒత్తిడి...!