Webdunia - Bharat's app for daily news and videos

Install App

దత్తన్న అలయ్ బలయ్ వేడుకకు పవన్.. విష్ణును పట్టించుకోని జనసేనాని!

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (16:13 IST)
ప్రతి ఏటా దసరా మరుసటి రోజున బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయి ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం జలవిహార్‌లో నిర్వహించండ ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు ప్రముఖులు కలుసుకున్నారు. 
 
ఈసారి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యాయరు. కొద్దిసేపటి క్రితమే టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తెలంగాణ గవవర్నర్ తమిళ సై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అలయ్ బలయ్‌ కార్యక్రమానికి విచ్చేశారు. 
 
తెలుగురాష్ట్రాల మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలయ్ బలయ్‌లో తెలంగాణ సంసృతి ఉట్టిపడే కళాకారుల నృత్యాలతోపాటు తెలంగాణ చడ్రుచుల వంటకాలు ఇక్కడ ప్రత్యేకం. దసరా తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం, ఆలింగనం చేసుకోవడం అలయ్ బలయ్ ప్రత్యేకత.
 
అయితే, ఈ సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో నెటిజన్లను ఓ ప్రశ్న అడిగారు. ఓ వీడియో పంచుకున్న విష్ణు... ఈ వీడియో చివర్లో ఉన్నది ఎవరో గెస్ చేయగలరా? అంటూ ట్వీట్ చేశారు.
 
ఆ వీడియోలో చివర పవన్ కల్యాణ్ అలయ్ బలయ్ వేదిక దిగువన మామూలు కుర్చీలో కూర్చుని ఉండడం చూడొచ్చు. కొన్ని ఫొటోల్లో పవన్ కల్యాణ్ వేదికపై ఎంతో ఠీవిగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉండడం దర్శనమిచ్చింది. కాగా, మంచు విష్ణు చేసిన పోస్టుపై నెటిజన్ల స్పందన ఘాటైన రీతిలో ఉంది. దాదాపు ప్రతి రిప్లయ్ లోనూ మంచు కుటుంబాన్ని ఏకిపారేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments