Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెపై అత్యాచారం.. నాలుగు నెలల గర్భం.. తండ్రికి జీవితఖైదు

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (11:02 IST)
హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి అతను బతికి వున్నంత వరకు జైలులోనే వుంచాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఫిలింనగర్‌లో నివసిస్తోంది. 
 
కుటుంబ యజమాని సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా.. అతడి భార్య ఇంటి పని చేస్తోంది. వీరికి కుమార్తె 14 ఏళ్ల కుమార్తె, కుమారుడు వున్నారు. అబ్బాయి తూర్పు గోదావరి జిల్లాలోనే ఓ హాస్టల్‌లో వుండి చదువుకుంటున్నాడు. కుమార్తె మాత్రం తల్లిదండ్రులతోనే వుంటోంది. 
 
జూలై 2021లో కుమార్తె అనారోగ్యం బారినపడి వాంతులు చేసుకోవడంతో తల్లి ఆమెను ఆస్పత్రిలో చూపించింది. పరీక్షించిన వైద్యులు ఆమె నాలుగు నెలల గర్భిణీ అని చెప్పడంతో ఆ తల్లి గుండె ఆగినంత పనైంది. ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి బోరున విలిపించింది. 
 
భార్య పనికి వెళ్లిన తర్వాత కుమార్తె తీసుకునే భోజనంలో తండ్రి నిద్ర మాత్రలు కలిపేశాడు. భోజనం చేసిన తర్వాత ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారానికి పాల్పడేవాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించేవాడని తెలిపింది. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. 
 
విషయం వెలుగులోకి రావడం నిందితుడు పారిపోయాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. 
 
ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు తుదితీర్పు వెలువరించింది. నిందితుడు మరణించేంతవరకు జైలులోనే వుంచడంతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం