Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మరో నవీన్ హత్య కేసు రిపీట్.. ప్రేయసితో క్లోజ్‌గా వున్నాడని.?

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (13:09 IST)
తెలంగాణలో మరో నవీన్ హత్య కేసు రిపీట్ అయ్యింది. ప్రేమకు అడ్డుగా వున్న స్నేహితుడిని హతమార్చిన ఘటన మరవకముందే.. ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రేయసితో చనువుగా వుండటాన్ని సహించలేక స్నేహితుడిని మద్యం సేవించి బీర్ బాటిల్‌తో పొడిచి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. 
 
20 ఏళ్ల రాజ్ కపిల్ సాహు బీహార్ నుంచి రెండేళ్ల క్రితం తెలంగాణలో సెటిల్ అయ్యారు. 21 ఏళ్ల రాహుల్ కూడా బీహార్ నుంచే వచ్చి తెలంగాణలో వలస వచ్చాడు. ఈ ఇద్దరు స్నేహితులు ఒకే యువతిని ప్రేమించారు. అయితే ఆ యువతి కపిల్‌తో ప్రేమలో పడింది. దీన్ని రాహుల్ సింగ్ తట్టుకోలేకపోయాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం కపిల్‌ను రప్పించి ఇద్దరూ మద్యం సేవించారు. ఆ సమయంలో రాహుల్ స్నేహితులు కూడా వున్నారు.
 
అనంతరం బీరు సీసాలు పగలగొట్టి వాటితో పొడిచారు. రాయితో తలపై కొట్టాడు. దీంతో రాజ్ కపిల్ సాహు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటికి వచ్చింది. రాహుల్ వద్ద జరిపిన విచారణలో తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. అతనితో పాటు ఈ హత్యకు పాల్పడిన ఇతర నిందితులను కూడా అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments