Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యకు పూటుగా మద్యం పోసి కత్తితో గొంతు కోసిన తమ్ముడు...

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (14:05 IST)
తప్ప తాగి వచ్చి.. డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించిన అన్నయ్యను తమ్ముడు హత్య చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్ష్మయ్య, లక్ష్మీ దంపతులకు రాందాస్, రవీంద్ర అనే ఇద్దురు కొడుకులున్నారు. రాందాస్‌ పచ్చి తాగుబోతు.

ఇతనికి సరిత అనే యువతితో పెళ్లయింది. ఇద్దరూ నడిగడ్డతండాలో నివసిస్తున్నారు. రవీంద్ర తన తల్లిదండ్రులతో ఉంటున్నాడు. లక్ష్యయ్య తన ఇంటిని అమ్మేందుకు రూ.15.75 లక్షలు బేరం కదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.4 లక్షలు పుచ్చుకున్నాడు. లక్ష్మయ్య ఆ డబ్బుతో అప్పులు తీర్చి మిగిలిన డబ్బును వారి వద్దే ఉంచుకున్నారు.
 
విషయం తెలుసుకున్న రాందాస్, లక్ష్మయ్య ఇంటికి వచ్చి.. ఇల్లు అమ్మినప్పుడు వచ్చిన డబ్బు తనకు ఇవ్వాలంటూ ప్రతిరోజూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. అదేంటని తమ్ముడు రవీంద్ర అడిగితే అతనిపై కూడా దాడి చేసేవాడు. డబ్బు ఇవ్వకపోతే ముగ్గుర్నీ చంపేస్తానని బెదిరించాడు. రాందాస్ ప్రవర్తనను చూసి విసిగిపోయిన రవీంద్ర ఎలాగైనా అన్నను హతమార్చాలనుకున్నాడు. దాంతో రవీంద్ర స్నేహితుడు సాయితో కలిసి మనం పార్టీ చేసుకుందామని రాందాస్‌ను ఆదివారం రాత్రి ఇంటికి పిలిచాడు. రాత్రి కావడంతో తల్లిదండ్రులు ఆరుబయట నిద్రించారు. 
 
అన్నదమ్ముల్లు ఇంట్లో మద్యం సేవించారు. రాందాస్ మద్యం మత్తులోకి వెళ్లిపోగా రవీంద్ర, రాందాస్ లుంగీతో అతడి కాళ్లు, చేతులు కట్టేసి కూరగాయలు కోసుకునే కత్తితో అన్న రాందాస్ గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో జరిగింది. అన్నయ్యను హత్యచేసిన రవీంద్ర మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments