భార్య వద్దన్నా వినలేదు.. పారకర్రతో తలపై బాదాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (18:20 IST)
వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను హతమార్చాడు భర్త.. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మ బండలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ గ్రామానికి చెందిన సువర్ణ (32), రాజు పదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. బ్రతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం వారి ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే చిన్నాచితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
 
గత కొంత కాలంగా వీరిద్దరూ ఒకే మేస్త్రీ వద్దకు పనికి వెళ్తున్నారు. సువర్ణ అక్కడ ఓ వ్యక్తితో చనువుగా ఉంటుండటంతో భర్త రాజుకు అనుమానం వచ్చింది. అనేక సార్లు అతడితో మాట్లాడొద్దని సువర్ణను హెచ్చరించాడు రాజు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 
 
ఈ నేపథ్యంలోనే బుధవారం ఇదే విషయమై ఇరువురికి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజు పారకర్రతో తలపై బాదాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: బొమ్మరిల్లు 2 తీయాలంటే ఆది, సాయి కుమార్ లతో తీయాలి : దిల్ రాజు

అనసూయ హీరోయిన్ కాదా?

ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత సారథ్యంలో గాంధీ టాక్స్ విడుదలకు సిద్ధమవుతోంది

క్రాంతి మాధవ్ మూవీ దిల్ దియా.లో భిన్నమైన పాత్రలో చైత‌న్య‌రావు

Bellamkonda: టైసన్ నాయుడు లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు

వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments