Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాయితీకి నిలువెత్తు ఆదర్శం... అశ్వరథ ఊరేగింపు...

ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకుంటున్న అధికారులను పట్టించిన ముగ్గురు వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. అశ్వరథంపై కూర్చోబెట్టి.. మెడలో పూలదండలు వేసి... ఊరంతా ఊరేగించారు.

Webdunia
శనివారం, 21 జులై 2018 (12:57 IST)
ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకుంటున్న అధికారులను పట్టించిన ముగ్గురు వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. అశ్వరథంపై కూర్చోబెట్టి.. మెడలో పూలదండలు వేసి... ఊరంతా ఊరేగించారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయారు. నిజాయితీకి నిలువెత్తు ఆదర్శంగా నిలిచిన ఆ ముగ్గురికి జరిగిన సన్మానం వివరాలను స్పందించారు.
 
మహబూబాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ యాదవ్‌, నర్సంపేటకు చెందిన జడల వెంకటేశ్వర్లు, భూపాల్‌పల్లి జిల్లా జంగేడుకు చెందిన పాలిక రఘుచారి ఈ ముగ్గురు వివిధ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగారు. 
 
ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీరి ద్వారా ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అవినీతి అధికారులను పట్టించిన నిజాయితీపరులుగా వీరిని ఈ విధంగా ఘనంగా సత్కరించింది జ్వాల స్వచ్చంధ సంస్థ. 
 
ఈ ముగ్గురినీ జూలై 20వ తేదీ శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలో గుర్రపు బండీ ఎక్కించి ఊరేగించారు. సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా హాజరై.. ఒక్కొక్కరికీ రూ.15వేలు నగదు బహుమతి అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments