హానర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త ఫీచర్
హావాయ్ సంస్థకు చెందిన హానర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్లకు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో ఆయా ఫోన్లలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.
హావాయ్ సంస్థకు చెందిన హానర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్లకు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో ఆయా ఫోన్లలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. జనవరి 24లోగా ఈ ఓవర్ ద ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్ వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించాలంటే అప్‌డేట్ వచ్చాక సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ ఫోన్ ధర రూ.29,999. ఇది కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఆక్టాకోర్ కిరిన్ 970 చిప్‌సెట్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నెల్ మెమొరీ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూజర్ ముఖాన్ని, స్థానాన్ని గుర్తించి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది.