Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నతోనే ప్రేమాయణం, వద్దని వారించినా వినని యువతి చివరికి...

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (10:19 IST)
వరుసకు అన్న. తోడల్లుడి కుమారుడు. అయితే  ఆ యువతి అతడిని ప్రేమించింది. ఆ విషయాన్ని అతనికే చెప్పింది. తొలుత అతడు కాదన్నాడు. ఒత్తిడి చేయడంతో ఆ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఇద్దరూ అన్ని విధాలుగా దగ్గరయ్యారు. చివరకు ఇంట్లో తెలిసి మందలించారు. కానీ తను ఇష్టపడినివాడు దూరమవుతున్నాడన్న బాధతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని నార్నూల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కుమార్తె  వైష్ణవికి 15 యేళ్ళు. ఈ మధ్యే 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటి దగ్గరే ఉంటోంది. శ్రీనివాస్ భార్య ఆదిలాబాద్ నగరంలో అంగన్‌వాడీలో విధులను నిర్వర్తిస్తోంది.
 
దీంతో ఆమె అక్కడే ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన అన్న మహేష్ తరచూ ఇంటికి వచ్చేవాడు. ఏవేవో కథలు చెప్పేవాడు. అన్న కావడంతో తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అతనికి బాగా దగ్గరైపోయింది వైష్ణవి.
 
అన్నను ప్రియుడుగా మార్చేసుకుంది. మొదట్లో ఇది తప్పని చెప్పాడు మహేష్. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో ఇతనే మారిపోయి ప్రేమికుడయ్యాడు. విషయం కాస్తా ఇంట్లో తెలిసిపోయింది. వైష్ణవిని మందలించారు. ఆదిలాబాద్ నగరంలోని తల్లి ఇంటికి పంపారు. దీంతో ఆ యువతి మనస్థాపానికి గురైంది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments