Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో పగటిపూట లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేత?

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (13:24 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. పగటిపూట లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు అమల్లో ఉంది. 
 
ఆ తర్వాతి నుంచి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు ఇది అమల్లో ఉండనుండగా, ఆ తర్వాతి నుంచి ఉదయం పూట నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
20వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 20 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
అలాగే, సడలింపుల్లో భాగంగా ఆర్టీసీ, మెట్రో రైలు సర్వీసు వేళలను పొడిగించనున్నారు. పార్కులు తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే, ఈ-పాస్ నిబంధనలను కూడా ఎత్తివేయనున్నారు. 
 
జులై 1 నుంచి పబ్‌లు, జిమ్‌లతోపాటు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లకు కూడా అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి ఒంటిగంట వరకు మాత్రమే సడలింపులు ఉండగా, దీనిని కూడా ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments