దశలవారీగా సమస్యలు పరిష్కరించుకుందాం: మంత్రి హరీశ్ రావు

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (08:40 IST)
సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణ  ప్రగతి కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి  హరీశ్ రావు ప్రారంభించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులోని నారయణ రెడ్డి కాలనీని సందర్శించారు. వీధి వీధి తిరుగుతూ... కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మహిళలను చెత్త బండి వస్తూందా లేదా అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు వస్తోందని మహిళలు చెప్పడంతో మంత్రి హరీశ్ రావు...మున్సిపల్ కమిషనర్ ను పిలిచి చెత్త సేకరణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

కాలనీలో కరెంటు సమస్యలు ప్రస్తావించడంతో విద్యుత్ శాఖ అధికారులను పిలిచి కాలనీ వాసుల ముందే సమస్యల పరిష్కారనికి కృషి చేయాలని చెప్పారు. 12 ఇళ్ల మీది నుంచి కరెంటు వైర్లు వెళుతున్నాయని ప్రమాదకరంగా ఉందని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు.

ఈ సమస్య పరిష్కారించాలని సూచించారు.ఓ ఇంటి ముందు డ్రైన్లో ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన మంత్రి ఆ ఇంటి మహిళను పిలిచి ఇలా ప్లాస్టిక్ వేయద్దని, తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఉంచాలని, చెత్త సేకరించే వాహనం వచ్చాక ఇవ్వాలని సూచించారు.

తమకు గ్యాస్ సిలిండర్లు లేవని కొందరు మహిళలు చెప్పడంతో ఆర్డీవోను పిలిచి అర్హులైన అందరికీ సిలండర్లు వచ్చేలా చూడాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మరి కొందరు మహిళలు  రేషన్ షాపు డీలర్  రేషన్ సరిగా ఇవ్వడం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు.

తమను ఇష్టారీతిన దూషిస్తూ మాట్లాడుతున్నారని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలో దాదాపు పది రోజుల పాటు  రేషన్ సరఫరా చేయాలని ఆ సమయాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని  ఎమ్మార్వోను ఆదేశించారు.

దీనిపై విచారణ జరిపించి రేషన్ ఎందుకు ఇవ్వడం లేదో చూడాలన్నారు. అనంతరం మంత్రి హరీశ్ రావు స్మశాన వాటికను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments