Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం: మంత్రి కేటీఆర్‌

Webdunia
గురువారం, 5 మే 2016 (09:41 IST)
మౌలిక వసతులు, పారదర్శక పాలనతో వ్యాపారానికి అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మలేషియా ప్రతినిధి బృందాన్ని కోరారు. మలేషియా, వ్యాపార, పరిశ్రమల శాఖమంత్రి ముస్తఫా మహమ్మద్‌ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తల ప్రతినిధి బృందం బుధవారం కేటీఆర్‌తో సమావేశమైంది. 
 
ఇందులో మలేషియా, తెలంగాణ మధ్య వ్యాపార సంబంధాలు, పెట్టుబడులపై వారు చర్చించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం, వ్యాపార అవకాశాలను కేటీఆర్‌ వారికి వివరించారు. హైదరాబాద్‌ నగరంలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ కోరారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానంతో ముందుకు వెళుతోందని, ముఖ్యంగా.. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూనే.. పరిశ్రమలకు అనుమతులు తక్షణం మంజూరు చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments