Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు కాంగ్రెస్సే నంబర్ వన్ విలన్.. కేటీఆర్

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (13:14 IST)
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో పర్యటించే అర్హత రాహుల్ గాంధీకి లేదని విమర్శించారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి తెలంగాణ కేరాఫ్. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక. గత పదేళ్లుగా గిరిజన యూనివర్సిటీ గురించి రాహుల్ ఎందుకు మాట్లాడలేదు.

కనీసం ఒక్కసారైనా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు నిలబడలేదు. విభజన హామీలపై ఎన్డీయేను ఎన్నడూ ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. 
 
100 రోజుల్లో కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన పార్టీ మీది. మేనిఫెస్టోలో లేని హామీలను నెరవేర్చిన ప్రభుత్వం మాది. కర్ణాటకలో రైతులకు ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వలేమని చేతులు ఎత్తేసిన నిస్సహాయ దద్దమ్మలు మీరు.
 
రైతులకు నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ అందజేస్తోంది. తెలంగాణలో సాగును మార్చిన పాలన మాది. తెలంగాణా నాటకాలకు తెరతీస్తే ఎవరు నమ్మరు, అవినీతికి కేరాఫ్‌ కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లు వేసిన కర్నాటక ప్రజలు నిండా మునిగిపోయారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్ల వేధింపులు. 
 
తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యం.. వందల మంది ప్రాణనష్టానికి కారణమైంది. నిన్న, నేడు, రేపు, గాడ్సేకి గాంధీభవన్ కట్టబెట్టిన కాంగ్రెస్... తెలంగాణకు నంబర్ వన్ విలన్. తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ. కోట్ల డబ్బు, భూములు టిక్కెట్ల కోసం రాబందు, రేవంత్ రాస్తున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడం లేదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ములుగు జిల్లా రామప్ప దేవాలయం నుంచి కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఏదో నడుస్తోందా? (video)

ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా వారధి

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసిన టాలీవుడ్ ప్రేమజంట!!

సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి : నటి మాధవీలత

మెగాస్టార్‌కి ఐకన్ స్టార్‌కి అదే తేడా? అక్కడే దెబ్బ కొడుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments