Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొట‌క్ మ‌హింద్రా బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో కూలీల‌కు హైద‌రాబాద్‌ ఏపీఎంసీ మార్కెట్ల వ‌ద్ద రేష‌న్ కిట్ల అంద‌జేత‌

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (20:00 IST)
క‌రోనా మ‌హ‌మ్మారి కొన‌సాగుతున్న స‌మ‌యంలో, దేశ‌వ్యాప్తంగా ఆహార స‌రుకుల‌ను అన్ని వ‌ర్గాల‌కు చేర‌వేస్తున్న వారికోసం ప‌గ‌లూ రాత్రి శ్ర‌మిస్తున్న జ‌ట్టు కూలీల‌కు అండ‌గా నిలిచేందుకు కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ (కొట‌క్‌) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్‌లోని అగ్రిక‌ల్చ‌ర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ క‌మిటీ (ఏపీఎంసీ)ల‌లో ప‌నిచేస్తున్న జ‌ట్టు కూలీల‌కు డ్రై రేష‌న్ కిట్ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు నేడు ప్ర‌క‌టించింది.
 
అత్య‌వ‌స‌ర‌మైన ఆహార ప‌దార్థాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏపీఎంసీలు క్రియాశీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఏపీఎంసీలు విజ‌య‌వంతంగా ప‌నిచేయడంలో రోజు కూలీలు లేదా జ‌ట్టు కూలీల పాత్ర అతి ముఖ్య‌మైన‌ది. రోజువారీ కూలీ తీసుకునే వీరు ప్ర‌తి రోజూ వేలాది ట‌న్నుల కొద్ది ధాన్యం, కూర‌గాయ‌లు మ‌రియు పండ్లు, లోడింగ్ మ‌రియు అన్‌లోడింగ్ చేస్తూ దేశానికి సంబంధించిన అత్య‌వ‌స‌ర‌మైన ఆహార ప‌దార్థాలు ప్ర‌తిరోజూ అంద‌జేస్తున్నారు. 
 
ఈ జ‌ట్టు కూలీ కార్మికుల‌కు అండ‌గా ఉండ‌టంలో భాగంగా కొట‌క్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌, న్యూఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు, జోద్‌పూర్ మ‌రియు ఇండోర్‌ల‌లోని ఏపీఎంసీ మార్కెట్ల‌లో డ్రై రేష‌న్‌ అందించారు. 
 
కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ డి.క‌న్న‌న్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ``కూర‌గాయ‌లు, పండ్లు మ‌రియు వ్య‌వ‌సాయ సంబంధ‌మైన ఉత్ప‌త్తులు దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చేర‌వేస్తూ ఆహార స‌ర‌ఫ‌రా ప‌క్రియ‌ను స‌మ‌ర్థ‌వంతంగా కొన‌సాగించ‌డంలో జ‌ట్టు కూలీ కార్మికులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు.
 
కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏపీఎంసీల యొక్క స‌హ‌జ‌సిద్ధ‌మైన నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ‌ను దెబ్బ‌తీసింది. దీనివ‌ల్ల రోజువారీ కూలీలు ఆదాయం పెద్దఎత్తున కోల్పోవాల్సి వ‌చ్చింది. జ‌ట్టు కూలీలు నిరంతరం చేస్తున్న వెల‌క‌ట్ట‌లేని శ్ర‌మ యొక్క ప్ర‌య‌త్నాన్ని గుర్తించి మావంతు స‌‌హాయంలో భాగంగా డ్రై రేష‌న్ కిట్ల‌ను అంద‌జేస్తున్నాం. త‌ద్వారా వారికి మ‌రియు వారి కుటుంబ స‌భ్యుల‌కు ఈ క‌ష్టాల‌లో అండ‌గా నిలుస్తున్నాం`` అని తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments