కెసిఆర్ షాక్.. కొండా సురేఖ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీ...

మాజీ మంత్రి కొండా సురేష్ కుటుంబ సభ్యులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైంది. కొండా సురేఖ భర్త కొండా మురళిలు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిక

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (15:11 IST)
మాజీ మంత్రి కొండా సురేష్ కుటుంబ సభ్యులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైంది. కొండా సురేఖ భర్త కొండా మురళిలు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి వీరు అత్యంత సన్నిహితులు. ఆయన మరణం తరువాత కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తరువాత టిఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు కొండా సురేఖ. సురేఖ పార్టీలో చేరక ముందే టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవి గ్యారంటీ అని హామీ ఇచ్చారు కెసిఆర్.
 
కానీ మూడేళ్ళవుతోంది. ఇప్పటివరకు ఆ ఊసే లేదు. కనీసం తరువాతన్నా వస్తుందన్న నమ్మకంలేకపోయింది. దీంతో కొన్నిరోజుల పాటు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు కొండా సురేఖ. ఇప్పుడు ఏకంగా పార్టీనే మారాలన్న నిర్ణయానికి వచ్చేశారని సమాచారం. కొండా సురేఖ భర్త కొండా మురళి కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి మేమొస్తామంటూ చెప్పారని సమాచారం. 
 
అయితే కొన్ని షరతులను పెట్టింది కొండా కుటుంబం. కొండా సురేఖతో పాటు పరకాలలో తన కుమార్తెకు టిక్కెట్టు కావాలని కోరారట. అయితే ఏదో ఒక సీటు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవాలన్న నిర్ణయానికి కొండా సురేఖ వచ్చేసినట్లు చెప్పుకుంటున్నారు. సురేఖ కనుక హ్యాండిస్తే వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments