Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. నేనే సీఎం: షర్మిల

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (06:44 IST)
తెలంగాణలో వైఎస్ షర్మిల తన పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించే సంకల్ప సభ వాల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
కాగా లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మంజిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని సూచించారు.
 
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేననీ, తానే సీఎంనని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదన్నారు. టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ అడిగితేనో వచ్చినవాళ్లం కాదని అన్నారు. వైఎస్‌ మహా ప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్‌ 9న తొలి అడుగు వేద్దామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments