కళ్లు తిరిగి పడిపోయిన మాట వాస్తవమే.. ఇపుడు బాగానే ఉన్నాను : కె.కవిత

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (18:06 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెలాఖరులో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర చిన్నాచితక పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు భారాస నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 
ఆ పార్టీకి చెందిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లతో పాటు కేసీఆర్ కుమార్తె కె.కవిత కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటిక్యాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కవిత.. ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఆమెను స్థానిక బీఆర్ఎస్ కార్యకర్త ఇంటికి తరలించి, అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. 
 
కవిత ఆరోగ్యంపై పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొనడంతో ఆమె ట్వీట్ చేశారు. అస్వస్థతకు లోనైన మాట వాస్తవమేనని, విశ్రాంతి తీసుకున్న తర్వాత తాను కోలుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఓ చిన్నారితో ముచ్చటిస్తుండగా తీసిన వీడియోను షేర్ చేశారు. చిన్నారితో గడిపిన తర్వాత తనకు మరింత శర్తి వచ్చినట్టు అనిపించిందని ఆమె పేర్కొన్నారు. డీహైడ్రేషన్ కారణంగానే ఆమె కళ్లు తిరిగి పడిపోయారని వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments