Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులు ఎమ్మెల్యేలపై మళ్లీ కేసీఆర్ ఫైర్

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (17:54 IST)
తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. మున్సిపల్‌ టికెట్ల కేటాయింపులో.. పాత, కొత్త నేతల మధ్య వివాదాలకు కేసీఆర్ చెక్‌ పెట్టనున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
 
మున్సిపాలిటీల వారిగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యేలు.. సీఎం కేసీఆర్‌ ముందుంచారు. కొన్ని నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌చార్జ్‌గా నియమించారు.సమావేశం తర్వాత బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్ అందించనున్నారు.
 
మంత్రులు ఎమ్మెల్యేల పై కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల అంశంపై చర్చించేందుకు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని భావించిన సీఎం కేసీఆర్... ఇందుకు సంబంధించి ముందుగానే వారికి సమాచారం అందించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలంతా నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకోవాలని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం నేడు ఉదయం ఆలస్యంగా సమావేశానికి రావడం కేసీఆర్‌కు ఆగ్రహం కలిగించాయి. మంత్రులు ఎర్రబెల్లి, ఈటల, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సమావేశానికి ఆలస్యంగా రావడంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇలా ఎందుకు జరిగిందని వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఉదయం పదిన్నర గంటలకే తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్... అప్పటికీ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోవడంపై ఆరా తీశారు. ఇక ఢిల్లీ వెళ్లాల్సి ఉండటంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.... సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments