భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (15:15 IST)
భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు సోమవారం ఉదయం బయలుదేరారు. ఆయన వెంట 600 కార్లు బయలుదేరగా, భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కూడా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా, సోలాపూర్‌ జిల్లాలో  భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 
 
మధ్యాహ్నం ఒంటి గంటకు మహారాష్ట్రలోని ధారిశివ్ జిల్లాలోని ఒమర్గాకు వీరంతా చేరుకుంటారు. అక్కడ భోజనం చేసిన తర్వాత సాయంత్రం 4.30 గంటలకు సోలాపూర్‌కు బయలుదేరి వెళతారు. రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి పండరీపురంకు చేరుకుని అక్కడి విఠోభార్ముణికి మందిర్‌లో కేసీఆర్, ఇత్ర నేతలు ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
ఆ తర్వాత సోలాపూర్‌ జి్ల్లా సర్కోలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలోనే ప్రముఖ నేత భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరుతారు. ఆ తర్వాత ధారాశివ్ జిల్లాలో కొలువైన తుల్జాభవనీ అమ్మవారి శక్తిపఠంను సందర్శించుకుని హైదరాబాద్ నగరానికి తిరుగు ప్రయాణమవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

Jonnalagadda: స్టార్ డమ్ కోరుకుంటే రాదు, ప్రేక్షకులు ఇవ్వాలి : చైతన్య జొన్నలగడ్డ

Manchu Manoj : మోహన రాగ మ్యూజిక్ తో మంచు మ‌నోజ్‌

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments