Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలు నడి వీధిలో స్నేహితుడి గొంతుకోసి రక్తం తాగిన కిరాతకుడు...

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (14:20 IST)
కర్నాటక రాష్ట్రంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి కిరాతకంగా పట్టపగలు నడి వీధిలో తన స్నేహితుడిని గొంతుకోసి రక్తం తాగాడు. ఈ కిరాతక చర్య రాష్ట్రంలోని చిక్‌బళ్ళాపూర్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయ్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన స్నేహితుడు మారేశ్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని బలంగా నమ్మేశాడు. ఇదేవిషయంపై మాట్లాడేందుకు రావాలంటూ మారేశ్‌ను విజయ్ ఇంటికి పిలిచాడు. దీంతో విజయ్ ఇంటికి మారేశ్ వచ్చాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా వారిద్దరి మధ్య వాగ్వివాదం తీవ్ర రూపం దాల్చింది. 
 
ఈ క్రమంలో కోపంతో రెచ్చిపోయిన విజయ్.. పదునైన ఆయుధంతో మారేశ్ గొంతుకోశాడు. దీంతో కిందపడిపోయిన మారేశ్‌ను ఏదో ప్రశ్నిస్తూ అతడి గొంతు నుంచి ధారలా వస్తున్న రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఈ షాకింగ్ దృశ్యాన్ని అటుగా నడిచివెళుతున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు... విజయ్‌ను అరెస్టు చేశారు. మారేశ్‌ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments