Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా తమ్ముడు విష ప్రయోగం చేస్తే చిరంజీవి కాపాడారు : పొన్నాంబరం

Advertiesment
ponnambalam
, గురువారం, 16 మార్చి 2023 (15:51 IST)
తన తమ్ముడు విష ప్రయోగం చేస్తే మెగాస్టార్ చిరంజీవి తన ప్రాణాలను కాపాడారని తమిళ నటుడు పొన్నాంబరం అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘనారా మొగుడు చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పొన్నాంబరం... ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా రాణించారు. 
 
స్టంట్‌మెన్‌గా కెరీర్‌ ప్రారంభించిన పొన్నంబలం 'కలియుగం' అనే తమిళ సినిమాతో నటుడిగా మారాడు. కెరీర్‌ మొదట్లో ఏడాదికి పది సినిమాల్లో కనిపించిన పొన్నంబలం ఇప్పుడు కాస్త డల్‌ అయ్యాడు. ఇదిలావుంటే, పొన్నంబలం తాజాగా ఓ ఇంటర్వూలో తన సొంత తమ్ముడే తనకు విషం పెట్టి చంపాలనుకున్నట్లు సంచలన విషయాలను వెల్లడించాడు.
 
గతకొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొన్నంబలం ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వాడకం వల్లే తన కిడ్నీలు పాడైయ్యాయని గతకొలంగా ఆయనపై వస్తున్న వార్తలపై పొన్నంబలం తాజాగా స్పందించాడు. అవన్ని అవాస్తవమని తన సొంత తమ్ముడి వలే అలా అయిందని విస్తుపోని నిజాలను వెల్లడించాడు. 
 
తన తండ్రికి నలుగురు భార్యలు. మూడో భార్య కొడుకును తన సొంత తమ్ముడిగా భావించి మేనేజర్‌గా పెట్టుకున్నా. నా వృత్తిపరమైన విషయాలన్ని తనే చూసుకునే వాడు. అయితే ఒకసారి నేను తాగే బీరులో స్లో పాయిజన్ కలిపాడు. అంతేకాకుండా విషం కలిపిన ఆహారాన్ని పెట్టేవాడు. దాంతో కొంతకాలానికి నా కిడ్నీలు పాడైపోయాయి. ఇక అప్పుడు డాక్టర్‌లను సంప్రదిస్తే విష ప్రయోగం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. అయితే అతను అలా చేశాడన్న విషయం ఇటీవలే తెలిసిందని’ పొన్నంబలం చెప్పుకొచ్చాడు.
 
కిడ్నీలు ఫేయిల్ అవడంతో కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్‌లు సూచించారని, దాంతో తన బంధువు ఒకతను కిడ్నీ దానం చేశాడని పొన్నంబలం చెప్పాడు. అయితే ఆ సమయంలో తనను ఆర్థికంగా చిరంజీవి ఆదుకున్నారని తెలిపాడు. చికిత్స కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఎవరిని అడగాలో, ఏం చేయాలో అర్థం కాని సమయంలో చిరంజీవి గుర్తుకు వచ్చాడని పొన్నంబలం తెలిపాడు. 
 
చిరంజీవికి ఫోన్‌ చేసిన తన సమస్య గురించి చెప్పి, సాయం చేయమని అడిగాను. అప్పుడు చిరంజీవి నేనున్నాంటూ భరోసా ఇచ్చాడు. లక్ష, రెండు లక్షలు హెల్ప్‌ చేస్తారని అనుకున్నాను. కానీ మరో ఐదు నిమిషాల్లో అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్‌ వస్తుంది. రిపోర్ట్స్‌ తీసుకెళ్లి అడ్మిట్‌ అ్వవమని చెప్పాడు. ఆ హాస్పిటల్‌లో నన్ను ఎంట్రీ ఫీజ్ కూడా అడగలేదు. మొత్తం బిల్లు రూ.40 లక్షలు అయింది. చిరంజీవి అంతా చూసుకున్నారని చిరు చేసిన సాయాన్ని వెల్లడించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్కార్‌పై ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు.. చెత్త సినిమాలను పంపిస్తున్నారు..!