జనగామలో కేసీఆర్ టూర్-తగ్గేదేలే.. ఇది కేసీఆర్ అడ్డా.. అంటూ..

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (12:56 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. ప్రధాని మోదీ పార్లమెంటులో విభజనపై మాట్లాడటం, ఆ తర్వాత టీఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేయడంతో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. మోదీపై టీఆర్ఎస్ నేతలు మండిపడటం, వారికి బీజేపీ కౌంటర్ ఇస్తుండటంతో జనగామ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. 
 
ఇక ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్.. ముందుగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించనున్నారు. 
 
అధికారులతో సమీక్ష అనంతరం భోజనం చేసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జనగామ జిల్లా మోడల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
 
అనంతరం సమీపంలోని మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా జనగామ పట్టణాన్ని టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలతో నింపేశారు.
 
కేసీఆర్ సభ జరిగే మైదానంలో "తగ్గేదేలే.. ఇది కేసీఆర్ అడ్డా" అనే క్యాప్షన్‌తో ఏర్పాటుచేసిన భారీ బెలూన్ ప్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సభకు సుమారు లక్షా 30 వేల మంది సభకు హాజరు కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments