Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ప్రభుత్వం రికార్డులు... ఎందులోనో తెలుసా?

భగభగమంటున్న సూర్యుడు. మండుతున్న ఎండలు. బయటకు వెళ్ళాలంటేనే భయపడిపోయే పరిస్థితి. దీంతో కూల్ కూల్ అని తపిస్తున్న కుర్రకారు ఇష్టానుసారం బీర్లను తాగేస్తున్నారు. మద్యం అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ బీర్లతో సేద తీరచ్చని భావిస్తున్నారు. ఏఫ్రిల్ 30వ తేదీ సోమవారం ఒ

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (15:40 IST)
భగభగమంటున్న సూర్యుడు. మండుతున్న ఎండలు. బయటకు వెళ్ళాలంటేనే భయపడిపోయే పరిస్థితి. దీంతో కూల్ కూల్ అని తపిస్తున్న కుర్రకారు ఇష్టానుసారం బీర్లను తాగేస్తున్నారు. మద్యం అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ బీర్లతో సేద తీరచ్చని భావిస్తున్నారు. ఏఫ్రిల్ 30వ తేదీ సోమవారం ఒక్కరోజే తెలంగాణా బీర్ల అమ్మకాలను బద్దలు కొట్టింది. ఒక్క బీర్ల అమ్మకాలతో తెలంగాణా ఆదాయం 175 కోట్ల ఆదాయం లభించిందట. నాలుగు లక్షల 60 వేల 252 కేసుల బీర్లు అమ్ముడయ్యాయట. ఒక్కో కేసులో 12 బీర్లు ఉంటాయి కాబట్టి మొత్తంగా 51 లక్షల 83 వేల 24 బీర్లు తాగారట. 
 
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే పెద్ద రికార్డట. రాష్ట్ర చరిత్రలో మందుబాబులు కొత్త చరిత్రను సృష్టించారట. ఒక్కరోజులోనే ఇంత పెద్ద మొత్తంలో ఎక్సైజ్ ఆదాయం రావడం ఇదే తొలిసారట. గతంలో 132 కోట్లు ఉన్న రికార్డు ఇప్పుడు 175 కోట్లకు చేరడం ఎక్సైజ్ శాఖనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 25 కోట్లకు విలువైన బీర్ల అమ్మకాలతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా 22 కోట్ల మేడ్చల్, రంగారెడ్డి జిల్లా మూడవ స్థానంలో ఉన్నాయి. 
 
ప్రతి జిల్లాలో 5 కోట్ల రూపాయల బీర్లు అమ్మకాలతో చరిత్ర సృష్టించారట. బీర్లకు రోజురోజుకు డిమాండ్ ఏర్పడటంతో కొరత లేకుండ చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ఉత్పత్తిని పెంచి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారట అధికారులు. ఒక రకంగా మంచి నీళ్ళ కంటే బీర్లు తాగారనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదేమో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments