Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎర్ సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్..

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (16:41 IST)
తెలంగాణ సర్కారుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పంజాబ్‌లో ఏటా ఒక్కసారి మాత్రమే ధాన్యం వస్తుందన్నారు.. అయితే ఏపీకి లేని సమస్య తెలంగాణకు మాత్రమే ఎందుకొస్తుందంటూ ప్రశ్నించారు. 
 
ఏ రైతు కూడా బాయిల్డ్ రైస్ పండించడు.. మిల్లింగ్‌లోనే అది బాయిల్డ్‌ రైస్‌గా మారుతుంది.. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో లేని సమస్య తెలంగాణకు ఎందుకు వస్తుందన్నారు.
 
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తే జాలేస్తుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయ చదరంగంలో రైతుల్ని బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అధికారం నిలబెట్టుకోవడానికి రైతులను కేసీఆర్ బలి చేస్తున్నారని విమర్శించారు. కొడుకుకు అధికారం ఇచ్చేందుకు జరిగే ప్రయత్నాల్లో బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు.  
 
బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ హెలికాఫ్టర్లు వేసుకొని దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు కిషన్‌రెడ్డి. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా 4 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచామని రేపు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments