పెరుగుతున్న గ్యాస్ డీజిల్, పెట్రోల్ ధరలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. జీడీపీ పెంచమంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిన ఘనత మోడీ సర్కార్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో రైతులు ఆందోళనలో ఉన్నారు.. బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారు.. కానీ, ధాన్యం సేకరణపై మాత్రం మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమం తర్వాత మనం రోడ్లపైకి రావడం మళ్లీ ఇదే మొదటిసారి అని వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ 400 రూపాయాలకే ఇవ్వాలని, పెరిగిన భారాన్ని కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు.
పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేత బండి సంజయ్‌పై మండిపడ్డారు. దమ్ము ఉంటే కేంద్రం నుంచి సిలిండర్‌పై తెలంగాణకు సబ్సిడీపై ప్రత్యేక ప్యాకేజి ఇప్పించాలని సవాల్ విసిరారు.