Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో పదేళ్లపాటు తెలంగాణ సీఎం కేసీఆర్: మంత్రి హరీశ్ రావు పూజలు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (16:29 IST)
కేసీఆర్ జన్మదినం సందర్భంగా దర్గాలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీష్ రావు గారు. సిద్దిపేట మునిసిపల్ పరిధి 8వ వార్డ్ నర్సాపురం, 2వ వార్డ్ దొబిగల్లీలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కెసిఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ సోదరుడైన కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివి. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను చాలా రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నాయి.
 
తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి. సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటున్నాము అంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంకా పది సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగేది. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యం అయింది. తెలంగాణ రావడం వల్లే గోదావరి జలాలు సిద్ధిపేటను తాకాయి.

సిద్దిపేట రక్షిత మంచినీటి పథకం మిషన్ భగీరథకు స్ఫూర్తిగా దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశాన్ని తాకేలా తీసుకెళ్లిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను గల్లీ గల్లీలో నిర్వహించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments