Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణం

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (14:59 IST)
తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు నేడు శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
 
మాజీ ఎంపీ, సీఎం కెసిఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఏమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ సాధించారు. ఈ సెగ్మెంట్ లో మొత్తం 824  ఓట్లు ఉండగా కవితకు 728 ఓట్లు వొచ్చాయి. బీజేపీ కి కేవలం 56  ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 29 ఓట్లు దక్కాయి. 
 
 
ఏమ్మెల్సీ ఎన్నికైన కవిత, దామోదర్ రెడ్డి ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కే ఆర్ సురేష్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్  పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ మహ్మద్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్,  ఫారూఖ్ హుస్సేన్, భానుప్రసాదరావు, ఎమ్.ఎస్ ప్రభాకర్ రావు, ఎల్.రమణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments