రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.. కడియం ఆత్మగౌరవం లేదన్నారు..

తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి.. ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న కడియం శ్రీహరి.. తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (12:44 IST)
తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి.. ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న కడియం శ్రీహరి.. తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీని వీడి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో కడియం శ్రీహరి స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ఆత్మగౌరవం లేని వ్యక్తి అని ధ్వజమెత్తారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అభివృద్ధి చేసిందని శూన్యమని విమర్శించారు. తెరాస చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆ పార్టీ ఓర్వలేకపోతోందని దుయ్యబట్టారు.
 
అయితే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరనున్నారని వార్తలను రేవంత్ వర్గీయులు కొట్టిపారేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపాక పార్టీ మారేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. ఇందులో భాగంగా రెండు రోజులుగా రేవంత్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే ఈ రూమర్లపై ఎట్టకేలకు స్పందించిన రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments